తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ కు మొత్తం 88సీట్లు రాక 20 సీట్ల లో మహాకూటమి కుప్పకూలింది. రాజకీయాల్లో బండ్లు ఓడలు..ఓడలు బండ్లు అవుతాయనే సామేత ఈఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో తలపండిన రాజకీయ నేతలుగా ఉన్న సినీయర్ నేతలు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ లో అందరికన్న సీనియర్ గా పేరుగాంచిన జానారెడ్డి ఓటమిపాలయ్యారు. ఇక ఈఎన్నికల్లో మరో విచిత్రం చోటుచేసుకుంది.
ఒకే ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన ఇద్దరు నేతల్లో ఒకరు ఓడిపోగా మరోకరు విజయం సాధించారు. తాండూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోగా..అతని తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి విజయం సాధించారు. అలాగే మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలవ్వగా అతని తమ్ముడు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు నుంచి గెలుపోందారు. ఇక మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్ల నుంచి మంత్రి లక్మారెడ్డి చేతిలో ఓడిపోగా అతని తమ్ముడు మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి విజయం సాధించారు.