యువరాజుని చిత‌క్కొట్టారు..

186
Online News Portal
audi prince flogged in prison after court sentencing
- Advertisement -

నిబంధనలకు పాటించడంలో సౌది అరేబియా ఎంత కఠనంగా ఉంటుందో తెలిసిన విషయమే. తప్పు చేస్తే ఎంతటివారినైనా శిక్షిస్తాయి ఆ దేశ చట్టాలు. ఇటీవల ఓ వ్య‌క్తిని హ‌త్య చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు రుజువ‌వ‌డంతో ఏకంగా ఆ దేశ యువ‌రాజుకే మ‌ర‌ణ‌శిక్ష‌ను అమ‌లు చేసింది సౌదీ అరేబియా. తాజాగా మరో యువరాజును ఓ నేరం చేసినందుకు జెడ్డాలోని కారాగారంలో ఓ గ‌దిలో యువ‌రాజుని బంధించి, చిత‌క్కొట్టారు.

అల్ సౌద్ రాజవంశీకుల పాలనలో ఉన్న సౌదీ అరేబియాకు ప్రస్తుతం సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ రాజుగా ఉన్నారు. రాజ కుటుంబం చాలా పెద్ద‌దే కావడంతో అందులో యువరాజులు కూడా చాలా మందే ఉన్నారు. సౌదీ అరేబియా రాజు తప్పు చేసిన మరో యువరాజును తాజాగా శిక్షించాడు. జెడ్డాలోని జైలులో ఉన్న రాకుమారుడిని కోర్టు ఆదేశించిన ప్రకారం కొరడా దెబ్బలు కొట్టినట్లు సౌదీ పత్రిక బుధవారం ప్రచురించింది. అయితే రాకుమారుడి పేరు, ఏ నేరానికి శిక్ష వేశారు అనే వివరాలను వెల్లడించలేదు.

saudi

కాగా, గత నెలలో హత్య కేసులో సౌదీకి చెందిన మరో రాకుమారుడికి మరణశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. 2012లో సౌదీ రాకుమారుడు టుర్కీ బిన్‌ సౌద్‌ అల్‌-కబీర్‌ ఓ వ్యక్తిని కాల్చి చంపిన కేసులో దోషిగా తేలడంతో కోర్టు మరణశిక్ష విధించింది. అక్టోబరు 19న అతడికి శిక్ష అమలు చేశారు. 1970ల తర్వాత తొలిసారిగా గత నెలలో సౌదీ రాకుమారుడికి మరణశిక్ష అమలు చేశారు.యువ‌రాజుతో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఏడాది మొత్తం 134 మందికి మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేసింది సౌదీ ప్ర‌భుత్వం. సౌదీ రాజకుటుంబంలో వేలాది మంది ఉన్నారు.

2015లోనూ 158 మందికి ఈ దేశంలో మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేసిన‌ట్లు ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఎక్కువ‌గా హ‌త్య‌లు, మాద‌క‌ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణాలోనే మ‌ర‌ణ‌శిక్ష‌లు విధిస్తున్నారు. వీరిలో ఒక్క జనవరి నెలలోనే ఉగ్రవాదం ఆరోపణల కింద 47మందికి మరణశిక్ష అమలుచేశారు.న్యాయ‌వ్య‌వ‌స్థ పార‌ద‌ర్శ‌కంగానే ఉన్నా.. పెరిగిపోతున్న మ‌ర‌ణ‌శిక్ష‌ల‌పై అక్క‌డి హ‌క్కుల సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నాయి.

- Advertisement -