తెలంగాణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్,వరంగల్ వెస్ట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ తొలి రౌండ్ పూర్తయ్యే సరికి 3 వేల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గజ్వేల్,సిద్దిపేట,హుస్నాబాద్,తుంగతుర్తిలో టీఆర్ఎస్ లీడింగ్‌లో కొనసాగుతోంది. సిద్దిపేట తొలిరౌండ్ పూర్తయ్యేసరికి హరీష్ రావు 6 వేల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ లీడింగ్‌లో ఉన్నారు. జోద్‌పూర్‌లోని సర్దార్‌పుర్ నుంచి ఆయన లీడింగ్‌లో ఉన్నారు. బీజేపీకి చెందిన చంద్రకాంత్ మేఘ్‌వాల్.. కేశవరావుపట్టణం నుంచి లీడింగ్‌లో ఉన్నారు.
మక్తల్‌లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు.. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1228 కాగా, టీఆర్‌ఎస్‌కు 429, కాంగ్రెస్‌కు 312, బీజేపీకి 298 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు.