నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కీపర్ రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ ఆరుగురిని ఔట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ఆసీస్‌పై ఈ ఫీట్ సాధించిన తొలి భారత కీపర్‌గా రికార్డులకెక్కాడు.
అంతకు ముందు ఈ రికార్డు ధోనీ పేరుమీదుంది.సయ్యద్ కిర్మాణీ 6(5 క్యాచ్‌లు, ఒక స్టంప్), ధోనీ 6, సాహా 6(5 క్యాచ్‌లు, ఒక స్టంప్) ఈ ఘనతను సాధించారు. ధోనీ వారసుడిగా భావిస్తున్న పంత్.. కీపర్‌గానే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్నాడు.
ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 రన్స్‌కు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండు వికెట్ల నష్టానికి 80 రన్స్ చేసింది. రాహుల్ 44 రన్స్ చేసి ఔటయ్యడు.
6 catches for Rishabh Pant- Joint highest in an innings for India alongside MS Dhoni –https://t.co/lJ4QABDTjf #INDvAUS
— ESPNcricinfo stats (@ESPNcric_stats) December 8, 2018