కేజీఎఫ్‌ ప్రిరిలీజ్‌… అతిథిగా జక్కన్న

248
kgf
- Advertisement -

కన్నడ హీరో యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్‌. ఏఏ ఫిలింస్ – ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుండగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఎలాంటి కత్తిరింపులు లేకుండా సెన్సార్ బోర్డు సభ్యలు యూ/ఏ సర్టిఫికెట్ ని జారీ చేశారు. కాగా, రేపు సాయంత్రం హైదరాబాద్ లో దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళం,హిందీలో విడుదల కానున్న ఈ చిత్రంలో శ్రీనిధి ,శెట్టి నాయకా హీరోయిన్లుగా నటించగా రమ్యకృష్ణ .. నాజర్ కీలకమైన పాత్రలను పోషించారు.

ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్స్‌కి మంచిరెస్పాన్స్ వచ్చింది. 1970లో అమెరికా, రష్యా మధ్య జరిగిన గొడవ దాదాపు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోయింది. ఆ సమయంలో బంగారం ధరలు మిన్నంటాయి. అతి పెద్ద అతిపెద్ద బంగారు గని కేజీఎఫ్…ఈ గనిని ఒకే ఒక్కడు అదుపు చేస్తే ఎలా ఉంటుందనేదే సినిమా స్టోరీ.

- Advertisement -