ఫోర్బ్స్‌ జాబితాలో విజయ్ దేవరకొండ

263
vijay devarakonda
- Advertisement -

2018 సంవత్సరానికి గాను అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్నారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. 14 కోట్ల ఆదాయంతో 72వ స్థానంలో నిలిచిన విజయ్ సౌత్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు.

అర్జున్‌ రెడ్డి సినిమా టాలీవుడ్‌ లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ యంగ్ హీరో తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో అదే జోరు కంటిన్యూ చేశారు. త్వరలో డియర్ కామ్రేడ్‌తో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

సౌత్‌ నుంచి అగ్రస్థానంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నిలవగా పవన్‌ కల్యాణ్‌, విజయ్‌, ఎన్టీఆర్‌, విక్రమ్‌, మహేష్‌ బాబు, సూర్య, విజయ్‌ సేతుపలి లాంటి తారలు ఉన్నారు.బాలీవుడ్ కం‍డల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ 253.25 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో నిలవగా విరాట్‌ కోహ్లీ 228.09 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచాడు.ఈ లిస్ట్‌లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు కూడా చోటు దక్కటం విశేషం.

- Advertisement -