- Advertisement -
ముందస్తు ఎన్నికల్లో మహాకూటమికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఓవైసీ … బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పనున్నారని తెలిపారు.
కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ముస్లింల గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వం 50 వేల మంది ముస్లిం విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. నాలుగున్నరేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. ఒక్క హింసాత్మక ఘటన కూడా జరగలేదని ఓవైసీ గుర్తు చేశారు
ఈ దేశంలో, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల అవసరం ఉందన్నారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ చెప్పే సెక్యులరిజం మోసపూరితమని ఓవైసీ మండిపడ్డారు.
- Advertisement -