- Advertisement -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ ఓపెనర్ పృథ్వీ షా గాయపడ్డాడు. ఆసీస్ ఓపెనర్ బ్రయాంట్ కొట్టిన షాట్‌ను క్యాచ్ అందుకునే క్రమంలో అతని ఎడమకాలికి దెబ్బ తగిలింది. గాయంతో మైదానాన్ని వీడిన షా…ఆడిలైడ్ టెస్టుకు దూరమయ్యాడు. డిసెంబర్ 6న తొలి టెస్టు ప్రారంభం కానుంది.
బౌండరీ వద్ద క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో షా ఎడమ కాలి మడమకు గాయమైంది. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. గాయం తీవ్రతపై స్కానింగ్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నాం అని బీసీసీఐ తెలిపింది.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లోనే క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన పృథ్వీ.. 69 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లే ఉన్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -