ఇది చీకటి రోజు:మిథాలీ

279
mithali raj
- Advertisement -

తనపై కోచ్ రమేష్ పొవార్ చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసింది భారత ఉమెన్స్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. తన జీవితంలో ఇది చీకటి రోజు అని ట్వీట్టర్‌లో ఆవేదన వెళ్లగక్కింది.ఈ దేశం కోసం 20 ఏళ్ల పాటు ఎంతో నిబద్దతతో ఆడానని కానీ నా శ్రమకు తగిన ఫలితం దక్కలేదన్నారు.

నాదేశభక్తిని అవమానిస్తున్నారు..నా నైపుణ్యాన్ని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నాకు అండగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసింది.నా పై వస్తున్న ఆరోపణలతో ఎంతో వేదనకు గురవుతున్నానని ట్వీట్ చేసింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ నుంచి మిథాలీని తప్పించడం ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో పెద్ద చర్చకు దారితీసింది. తనకు జరిగిన అన్యాయంపై బీసీసీఐకి పంపిన లేఖలో కోచ్ రమేష్‌ పొవార్‌,బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీపై తీవ్రంగా మండిపడింది మిథాలీ.

ఈ నేపథ్యంలో బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిసిన జట్టు కోచ్‌ రమేశ్‌ పొవార్…మిథాలీ ఓపెనింగ్‌లోనే ఆడతానని పట్టుబట్టిందని.. లేదంటే ప్రపంచకప్‌ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని హెచ్చరించిందని తెలిపారు. దీంతో మిథాలీ ఆవేదన వ్యక్తం చేసింది.

- Advertisement -