తదుపరి చిత్రానికి సిద్దమౌతున్న పూరీ తనయుడు..

250
- Advertisement -

టాలీవుడ్‌ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్‌ పూరీ ఆంధ్రా పోరి అనే సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి డివైడ్ టాక్ రావ‌డంతో త‌ర్వాతి సినిమా కోసం స్వ‌యంగా పూరీనే రంగంలోకి దిగి త‌న త‌న‌యుడితో మెహ‌బూబా అనే సినిమా చేశాడు.

1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేప‌థ్యంలో జరిగిన లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా అభిమానుల‌కు నిరాశే మిగిల్చింది. అయితే మెహబూబూ చిత్రానికి ఆకాశ్ పడిన కష్టం చూసిన పూరీ..ఆకాశ్‌తో ఓ మంచి సినిమా తీయాల‌ని భావించాడ‌ట‌.

Akash Puri

ఈ నేపథ్యంలో పూరీ ఆయన కుమారుడి తదుపరి సినిమా కోసం సిద్దమౌతున్నాడు. అయితే ఈ సినిమాకి పూరీ నిర్మాతగానే వ్యవహరించనున్నాడు. పూరి కథాకథనాలను అందించిన ఈ సినిమాకి అనిల్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించారు. చివరిగా గాయత్రి భరద్వాజ్‌ను ఎంపిక చేసుకున్నారట.

ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయం కానుంది. మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. హీరోగా ఈ సినిమా ఆకాశ్‌కి మంచి బ్రేక్‌ను ఇస్తుందని పూరీ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

- Advertisement -