ధనుశ్ ‘మారి 2’..సెన్సార్ పూర్తి

612
dhanush mari 2
- Advertisement -

మాస్ హీరోగా తమిళనాట క్రేజ్ సంపాదించుకున్న హీరో ధనుష్‌. ఆయన హీరోగా మోహన్ దర్శకత్వంలో వచ్చిన మారి ఘనవిజయాన్ని సాధించింది. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పెద్ద హిట్ సాధించింది. దీనికి సీక్వెల్‌గా మారి 2 తెరకెక్కుతుండగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ధనుశ్ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ధనుశ్ సొంత బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

రఘువరన్‌ బీటెక్‌ సినిమాతో ధనుష్ తెలుగులో పాపులర్‌ అయ్యాడు‌. కాజల్‌ అగర్వాల్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మారి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

- Advertisement -