మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు గుండెజారీ గల్లందయ్యిందే దర్శకుడు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత అతను దర్శకత్వం వహించిన ఒక లైలా కోసం సినిమా అంత పెద్ద విజయం సాధించకపోయినా పర్వాలేదు అనిపించేలా ఉంది. ఆసినిమా అంతగా ఆడకపోవడంతో అతనికి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత నితిన్ హీరోగా సినిమా అంటూ ప్రచారం జరిగినా అది పట్టాలెక్కలేదు. మధ్యలో తన కుటుంబంలో కొన్ని గొడవల వల్ల కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
అతను చెప్పిన కథలు టాలీవుడ్ హీరోలకు నచ్చకపోవడంతో ఆయన శాండిల్ వుడ్ వైపు కన్నేశారు. తాజాగా ఆయన శాండిల్ వుడ్లో ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా విజయ్ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. నిఖిల్ హీరోగా మొదటి సినిమా జాగ్వార్.
ఈసినిమా పెద్దగా విజయం సాధించక పోవడంతో అతను కూడా మరే సినిమా చేయలేదు. జాగ్వార్ సినిమాను కూడా తెలుగు దర్శకుడు మహదేవ్. కన్నడ హీరోలు ఎక్కువగా మాస్ సినిమాలే చేస్తుంటారు. అందకు అనుగుణంగానే విజయ్ నిఖిల్ కు ఓ మంచి మాస్ కథ వినిపించినట్టు తెలుస్తుంది. మొత్తానికి చాలా రోజుల తర్వా త సినిమాను తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు విజయ్.