రీషూట్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్..

271
dear comrade
- Advertisement -

వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్నాడు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ. అర్జున్ రెడ్డి సినిమా త‌ర్వాత దాదాపు ఒకే సారి అర‌డ‌జ‌ను సినిమాల‌కు సైన్ చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. అందులో మొద‌ట‌గా మొద‌లు పెట్టిన మూవీ ట్యాక్సీవాలా. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈసినిమా విడుద‌లను వాయిదా వేశారు. ఇటివ‌లే విడుద‌లైన ఈమూవీ బాక్సాఫిస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబడుతోంది.

vjay

వ‌రుసగా సినిమాలు ఒప్పుకోవ‌డం వ‌ల్ల నోటా సినిమా అట్ట‌ర్ ప్లాప్ కావ‌డంతో త‌న త‌ర్వాతి సినిమాల స్ర్కీప్ట్ ల‌పై కొంచెం జాగ్ర‌త్త‌గ ఆలోచిస్తున్నాడట విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఒక‌దాని త‌ర్వాత మ‌రోక సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని తెలుస్తుంది. ఆయ‌న ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా డియ‌ర్ కామ్రేడ్.

vijay devarakonda

ఈసినిమాలో ఇంత‌వ‌ర‌కూ షూట్ చేసిన కొన్ని సీన్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు న‌చ్చ‌కపోవ‌డంతో మ‌ళ్లీ రీషూట్ చేద్దామ‌ని ద‌ర్శ‌క‌, నిర్మాత‌లకు చెప్పాడ‌ట‌. దీనికి వారు కూడా అంగీక‌రించి రీ షూట్ చేస్తున్నారు. మొద‌ట సినిమాకు వేస‌వి రిలీజ్ చేద్దామ‌ని ప్లాన్ చేసుకున్నారు కానీ, రీషూట్ కార‌ణంగా విడుద‌ల‌ను ద‌స‌రాకు వాయిదా వేసుకున్నారు చిత్ర‌యూనిట్. ఈమూవీని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు.

- Advertisement -