నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఆ సినిమా పరాజయం కావడంతో మరే సినిమాకు ఒప్పుకొలేదు. సరైన కథ కోసం వెతికి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. మొదట దర్శకుడు విక్రమ్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చిన కథ నచ్చకపోవడంతో ఆసినిమాను కూడా బన్నీ వద్దకున్నాడని సమాచారం.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన స్ర్కీప్ట్ వర్క్ ను రెడీ చేస్తున్నాడట త్రివిక్రమ్. అయితే తమిళ్ లో వచ్చిన 96 సినిమాను రిమేక్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట బన్నీ.
96′ తమిళ సినిమా చూసిన దగ్గర నుంచి అల్లు అర్జున్ ధ్యాస అంతా కూడా ఆ సినిమాపైనే వుందని సమాచారం.
వైవిధ్యమైన సినిమాలు చేస్తే తన కెరీర్ లో ఎప్పటికి గుర్తిండిపోతాయనే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. ఈసినిమాకు తెలుగు రైట్స్ తీసుకున్న దిల్ రాజు తో చర్చించారు అల్లు అర్జున్.