ఓట‌రు న‌మోదుకు మంచి స్పంద‌న వ‌చ్చిందిఃర‌జ‌త్ కుమార్

228
ceo
- Advertisement -

ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మాన్ని మంచి స్పంద‌న వ‌చ్చింద‌న్నారు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్. ఓటింగ్ శాతం పెంచేందుకు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌న్నారు. నిన్న‌టితో నామినేష‌న్ల గడువు ముగియ‌డంతో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త్వ‌ర‌లోనే ఓట‌ర్ స్లిప్ పంపిణి కార్య‌క్ర‌మం మొద‌లు పెడ‌తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో 32వేల 796 పోలింగ్ స్టేషన్లు , సర్వీస్ ఓటర్లు 9వేల 445 మంది ఉన్నారని చెప్పారు.

rajathkumar

పోలింగ్ స్టేషన్ల‌కు పెంపున‌కు విజ్న‌ప్తులు వ‌చ్చాయ‌న్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు లక్షా 60వేల 509 మంది పోలింగ్ సిబ్బందిని అవసరమ‌న్నారు. పోలింగ్ కు 30వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటుచేస్తామ‌న్నారు. మ‌న రాష్ట్రంలో 18వేల మంది పోలీస్ బందోబస్త్ ఉన్నార‌ని, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి అదనపు భద్రతా బలగాలను రప్పిస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 3వేల 583 నామినేషన్లు దాఖలు అయ్యాయన్నారు.

- Advertisement -