టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మహానటి తర్వాత పలువురు సినీ,రాజకీయ ప్రముఖుల జీవితచరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న పోర్న్ స్టార్ షకీలా. ఆమె జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతుండగా బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వం వహిస్తుండగా సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ,మలయాళం,తమిళ భాషల్లో సినిమా విడుదల కానుండగా షకీల కుటుంబనేపథ్యం,సినీ రంగంలోకి ఎంట్రీ,ఇండస్ట్రీలో ఆటుపోట్లు, నిరుపేద నుంచి ధనికురాలై మళ్లీ పేదగా మారిన వ్యక్తి కథగా సినిమా తెరకెక్కుతోంది.
మ్యాజిక్ సినిమా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షకీలా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. రిచా భారీ నగలతో సరికొత్త లుక్‌లో కనిపిస్తుంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో హిందీ పదాలు రాసి ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా రిలీజ్ కానుండగా షకీలా మూవీకి క్యాప్షన్ నేను పోర్న్ స్టార్ కాదు అని ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది.