రెబల్స్‌కు అండగా ఎస్పీ,బీఎస్పీ..!

224
vinod shankar rao
- Advertisement -

తెలంగాణలో కీలకఘట్టం నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద తప్పలేదు. నమ్ముకున్న హస్తం హ్యాండివ్వడంతో ఆశావాదులంతా అసమ్మతి వాదులుగా మారిపోయారు. వీరవిధేయులంతా హస్తం జెండా గద్దెలను కూల్చేస్తూ ఏనుగు చెంతకు చేరారు. వివిధ పార్టీల రెబల్స్ అభ్యర్థులకు అండగా మారాయి బహుజన సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ),సమాజ్ వాది పార్టీ(ఎస్పీ.

మాజీ మంత్రులు వినోద్ కుమార్,శంకర్ రావు బీఎస్పీ తరపున బరిలో నిలిచారు. ఎన్నికల ముందువరకు టీఆర్ఎస్‌లో చక్రం తిప్పిన మాజీమంత్రి వినోద్ కుమార్ చెన్నూర్ టికెట్‌ను ఆశీంచారు. కానీ ఆ టికెట్ ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి చెన్నూరు నుంచి పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో తప్పని పరిస్థితుల్లో బీఎస్పీ తరఫున బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు.

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు సైతం షాద్‌నగర్‌ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తరఫున పోటీ చేస్తున్నారు. మరికొంతమంది ప్రముఖులు సైతం ఈ రెండు పార్టీల బీఫామ్‌లు అందుకుని బరిలో దిగినట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో బీఎస్పీ రెండు స్థానాలు దక్కించుకుంది. మరి ఈ సారి ఖాతా తెరుస్తుందో లేదో వేచిచూడాలి.

- Advertisement -