ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా. తర్వాత బాలీవుడ్లో అడుగు పెట్టి తాజాగా రవితేజతో అమర్ అక్బర్ అంటోనీ మూవీతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 16న సినిమా ప్రేక్షకుల ముందుకురాగా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది.
ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న ఇలియానాకు తీవ్ర నిరాశే మిగిలింది. అయితే ఇదేమీ తన తర్వాతి సినిమాలపై పడకుండ జాగ్రత్త తీసుకుంది ఇల్లీ బేబి. ఏకంగా బాలీవుడ్ ఆఫర్‌ని కొట్టేసింది. జాన్ అబ్రహాం హీరోగా అనీస్ బజ్మీ రూపొందిస్తున్న ‘పాగల్ పంటి’ చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. దీంతో తనకు వచ్చిన సినిమా ఛాన్స్‌తో ఉబ్బితబ్బైపోతోంది.
ఇటీవల సినిమా ప్రమోషన్‌లో భాగంగా తెలుగులో నటించడం, హైదరాబాద్‌లో ఉండటం చాలా ఇష్టమని తెలిపింది ఇలియానా. మంచి కథ కోసమే ఇంతవరకు ఎదురుచూశానని శ్రీను వైట్ల చెప్పిన స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పానని తెలిపారు. నా కెరీర్‌లో ఇలాంటి పాత్రని చేయడం ఇదే తొలిసారి. నటించడానికి మంచి అవకాశం లభించిందన్నారు. రవితేజ మంచి స్నేహితుడని… ఆయనతో కలిసి నటించడం ఎప్పుడూ సరదాగా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.