నేటితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ఇవాళ భారీ సంఖ్యలో ముఖ్యనేతలు నామినేషన్లు దాఖలు చేయడనుండగా లాస్ట్ లీస్ట్‌ని విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆరుగురితో తుదిజాబితాను విడుదల చేయగా ఈ జాబితాలో కార్తీక్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలకు నిరాశే ఎదురైంది.
మిర్యాలగూడ నుంచి ఆర్. కృష్ణయ్య, దేవరకద్ర నుంచి డాక్టర్ పాబన్ కుమార్ రెడ్డి, నారాయణపేట నుంచి వామనగిరి కృష్ణ, సికింద్రాబాద్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నారాయణఖేడ్ నుంచి సరేశ్ కుమార్ షెక్తార్, కోరట్ల నుంచి జువ్వాడి నర్సింగ్ రావు పోటీ చేయనున్నారు.
గత ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి టీడీపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన బీసీ సీంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఈసారి మిర్యాలగూడ నుంచి పోటీ చేయనున్నారు.ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఎల్బీ నగర్ లేదా తాండూరు స్థానాన్ని కేటాయించగా అనూహ్యంగా మిర్యాలగూడ స్థానాన్ని కేటాయించింది. ఇదే స్థానానికి టీజేఎస్ కూడా విద్యాధర్‌రెడ్డికి బీ ఫారం ఇవ్వడం గమనార్హం.
మొత్తం 94 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ తొలి జాబితాలో 65 మంది, రెండో జాబితాలో 10 మంది, మూడో జాబితాలో 13, తుది జాబితాలో ఆరుగురికి చోటు కల్పించింది.