సినిమా రంగంలో హీరోయిన్గా రాణించాలంటే గ్లామర్‌తోపాటు అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించాలి. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా ఆహార్యానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాలి. అలనాటి కథనాయికలు ఇదే అనుసరించారు. ఇటీవల వస్తున్న కథానాయికల్లోనూ నటనతో మెప్పించిన వారికే మంచి కెరిర్ కనిపిస్తోంది. ఈ విషయంలో మళయాళి హీరోయిన్లు బాగా దూసుకుపోతున్నారు.
ఇక నేను శైలజ సినిమాతో తెలుగులో పరిచయమైన కీర్తి సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా బిజీగా గడుపుతోంది. అయితే మాలీవుడ్ నుంచి వచ్చిన ఈ అమ్మడు గ్లామర్‌తోపాటు నటనతో మెప్పిస్తోంది. బలమైన కథాకథనాలు .. పాత్రకి ప్రాధాన్యత ఉండాలిగానీ, డీ గ్లామర్‌గా కనిపించడానికి తాను రెడీ అంటోంది కీర్తి.
అలాంటి పాత్రలతో దర్శక నిర్మాతలు తనను సంప్రదించవచ్చని తెలిపింది. అయితే ఇతర భాషల్లో సంగతేమోగానీ, తెలుగులో మాత్ర అలాంటి పాత్రలు వచ్చే అవకాశ తక్కువే అని చెప్పాలి. మరి ఈ అమ్మడి కోరిక తీరుతుందో లేదో చూడాలి.