- Advertisement -
అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిర్చు చెలరేగింది. అడవుల్లో చెలరేగిన మంటల్లో ఇప్పటివరకు 70 మంది ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా తప్పిపోయారు. మంటల్లో దాదాపు 8000 వేలకు పైగా భవనాలు కాలిపోయాయి.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. 1933 తర్వాత ఇంత విధ్వంసకరంగా కార్చిచ్చు చెలరేగడం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. 1933లో ఇదే కాలిఫోర్నియాలో కార్చిచ్చు వల్ల 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
లక్షల ఎకరాల అడవి కాలిబూడిదవ్వగా గాలి వేగంతో వీయడంతో కొన్ని కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. కాలిఫోర్నియా ప్రకృతి అందాలన్నీ హరించుకు పోయాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది ఇళ్లు వదలి పారిపోయారు. కుటుంబ సభ్యులు చెల్లాచెదురయ్యారు. ఇళ్లు కోల్పోయిన వారిలో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
- Advertisement -