మహేష్ మల్టీప్లెక్స్..ఫోటోలు చూశారా..!

301
mahesh asian cinemas
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏసియన్ ఫిలింస్ సంస్థతో మహేష్ మల్టీఫ్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుండగా ఈ థియేటర్స్‌కి ఏయంబీ(ఏషియన్ మహేష్ బాబు) సినిమాస్‌ అనే పేరును ఖరారు చేశారు. గచ్చిబౌలిలో మహేష్ మల్టీప్లెక్స్‌ ని రజనీ ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఏయంబీ సినిమాస్ పేరుతో నిర్మిస్తున్న2.ఓ సినిమాతో ప్రారంభంకానుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న థియేటర్స్ కావడంతో 2.ఓ లాంటి 3డీ విజువల్,4డీ ఆడియోతో ప్రారంభించడమే సరైన నిర్ణయమని మహేష్ భావిస్తున్నారు.

mahesh multiplex

ఇక మహేష్ థియేటర్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. థియేటర్‌ లుక్‌ని చూస్తుంటే సూపర్బ్‌గా ఉంది. మొత్తంగా కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టబోతున్న మహేష్‌-రజనీ 2.0తో ఎలాంటి ఓపెనింగ్స్‌ రాబడుతాడో వేచిచూడాలి.

mahesh multiplex

- Advertisement -