- Advertisement -
తెలంగాణలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటినుంచి(సోమవారం) ఈనెల 19వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన, 22వరకు నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబరు 7న పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.గంటల వరకు స్వీకరిస్తారన్నారు.
నామినేషన్‌తో పాటు అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యుర్థులైతే రూ.5వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, ఇందుకు గాను ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వారి కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక ప్రతిపాదకుడిని, ఇతరులు అయితే పది మంది ప్రతిపాదకులను చూపాలన్నారు. అభ్యర్థి పేరిట ఏదేనీ బ్యాంకులో ఖాతా తెరవాలన్నారు. నేటి నుంచి ఎన్నికలు ముగిసే వరకూ 144సెక్షన్ అమల్లో ఉంటుంది.
- Advertisement -