- Advertisement -
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా కేరళ లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. బన్నీని కేరళలో ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఆయన నటించిన సినిమాలు అక్కడ కూడా బాగా ఆడతాయి. ఇటివలే కేరళలో వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. వరదల్లో నష్టపోయిన వారికి అల్లు అర్జున్ అండగా నిలిచాడు. సీఎం రీలిఫ్ ఫండ్ కు రూ.25లక్షలు విరాళంగా ఇచ్చారు.
తాజాగా బన్నీకి కేరళ ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కేరళలో త్వరలో 66వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ లు నిర్వహించనున్నారు. నవంబర్ 10వ తేది నుంచి ఈ పోటీలు జరుగనున్నాయి. అయితే ఈ పోటీలకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. కేరళలో గత 65 ఏళ్లుగా ఈ బోట్ రేస్ పోటీలు జరుగుతున్నాయి.
- Advertisement -