నందమూరి బాలకృష్ణ హీరోగా విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్ట్‌లుగా రానున్న ఈ చిత్రం జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన వస్తున్న వార్తలు ప్రేక్షకులకి అమితానందాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలోని ముఖ్య పాత్రల కోసం పలువురు స్టార్స్‌ని ఎంపిక చేసిన చిత్ర బృందం తాజాగా అనుష్క శెట్టిని కూడా కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బీ సరోజాదేవి పాత్రలో అనుష్క నటిస్తున్నట్టు సమాచారం. అప్పట్లో ఎన్టీఆర్, సరోజాదేవి కలిసి నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఆయా సినిమాలకు చెందిన కొన్ని విషయాలను బయోపిక్‌లో చూపిస్తున్నారట. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తికాగానే, అనుష్క ఫస్ట్ లుక్ స్టిల్ విడుదల అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక సరోజాదేవి పాత్రలో అనుష్క నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.