నవంబర్ 10న… ‘ అమర్ అక్బర్ ఆంటోనీ ‘

215
Amar Akbar Anthony
- Advertisement -

మాస్ మహరాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ అమర్ అక్బర్ ఆంటోనీ ‘..నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10 న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు..ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాగ, రెండవ పాటను దీపావళి సందర్భంగా రేపు విడుదల చేయనున్నారు.

రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న ఈ సినిమా స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కగా ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

 Amar Akbar Anthony

తారాగణం:రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు.. సాంకేతిక నిపుణులు :స్క్రీన్ ప్లే , డైలాగ్స్ మరియు దర్శకత్వం : శ్రీను వైట్ల,కథ : శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి,నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (CVM),సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి,సీఈఓ : చెర్రీ,డీఓపీ : వెంకట్ సి దిలీప్,సంగీతం: ఎస్ఎస్ థమన్,ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ,ఆర్ట్ డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్,PRO : వంశీ శేఖర్

- Advertisement -