ఒకప్పుడు తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపిన శృంగార తార షకీలా జీవితంపై తెరకెక్కుతున్న చిత్రం ‘షకీలా’. షకీలాకు మళయాల చిత్రపరిశ్రమలో అక్కడి స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. షకీలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని ఇంద్రజిత్ లోకేష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ లుక్’ ఇటీవల విడుదలైంది.
ఈ సినిమాలో షకీలా పాత్ర పోషిస్తున్న రిచా చద్దా ‘షకీలా’ మూవీ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. షూటింగ్ స్పాట్‌లో ఓ సన్నివేశం చిత్రీకరణ వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇది తనకెంతో నచ్చింది అన్నారు రిచా. ఇందులో రిచా కేరళ యువతివలే కనిపించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. షకీలా పాత్ర కోసం తనను సంప్రదించినప్పుడు తనకు భయమేసిందన్నారు. అయితే, షకీలాను కలిసి మాట్లాడిన తర్వాత ఈ సినిమా చేయగలను అనిపించిందని తెలిపారు. షకీలా తనకు అన్యాయం చేసినవారిని సైతం క్షమించారని, ఆమె వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత ఈ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. తన నటనతో ఎంతో మంత్రి ప్రేక్షకులను ఆకట్టుకున్న షకీలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను ఆలరిస్తుందో చూడాలి.
.@RichaChadha on location shoot of film #Shakeela biopic. pic.twitter.com/kN6gVQIlWM
— Bhawna Munjal (@bhawnamunjal) October 31, 2018