రివ్యూ: సవ్యసాచి

279
savyasachi review
- Advertisement -

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సవ్యసాచి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లవ్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ప్రేమమ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన చందూ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది…?సవ్యసాచితో చైతూ హిట్ కొట్టాడా లేదా చూద్దాం..

కథ:

ఒకరికి ఒకరు పరిచయం లేని 21 మంది బస్సులో ప్రయాణిస్తుంటారు. అనుకోకుండా ఆ బస్సు ప్రమాదానికి గురువతుంది. ఈ ప్రమాదంలో విక్రమ్ ఆదిత్య(నాగ చైతన్య) తప్ప అందరూ చనిపోతారు. యాడ్ ఫిలీం మేకర్‌ అయిన విక్రమ్..వానిష్ ట్విన్ సిండ్రమ్‌తో ఇబ్బందిపడుతుంటాడు. విక్రమ్‌కు అక్క(భూమిక) కూతురు మహాలక్ష్మీ అంటే ప్రాణం. సీన్ కట్ చేస్తే ఓ
ప్రమాదంలో మహాలక్ష్మి చనిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది..?అసలు మహాలక్ష్మీ చనిపోతుందా..?బస్సు ప్రమాదానికి ఈ కథకు సంబంధం ఏంటి అనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ యాక్షన్ సీన్స్‌,నాగచైతన్య,మాధవన్ నటన. ఇద్దరు తమ పాత్రల్లో ఒదిగిపోయి పోటాపోటీగా నటించారు. ముఖ్యంగా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ చైతూ ఆకట్టుకున్నాడు. కామెడీ,రొమాన్స్,ఎమోషనల్ సీన్స్‌తో సూపర్బ్ నటన కనబర్చాడు. సైకో విలన్‌గా మాధవన్‌ ఒదిగిపోయాడు. మాధవన్‌ పలికించిన హావ భావాలు సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లాయి. హీరోయిన్‌ నిధి అగర్వాల్ కేవలం లవ్‌ స్టోరి, పాటలకే పరిమితమైంది. వెన్నెల కిశోర్‌, సుదర్శన్‌, సత్య తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

savyasachi

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ రొటీన్ టేకింగ్,లవ్‌ ట్రాక్‌. దర్శకుడు చందు మొండేటి తాను అనుకున్న కథను తెరమీద ఆవిష్కరించటంలో కాస్త తడబడ్డాడు. ప్రీ ఇంటర్వెల్ వరకు కథ మొదలు కాకపోవడం నిరాశకలిగిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. కీరవాణి సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. పాటలు పర్వాలేదనిపించినా నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఎడిగింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

ప్రేమమ్‌తో చైతూకి బిగ్గెస్ట్ హిట్‌ ఇచ్చిన దర్శకుడు చందు మొండేటి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన చిత్రం సవ్యసాచి. నాగచైతన్య,మాధవన్ నటన,యాక్షన్‌ సీన్స్‌ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా రొటీన్ టేకింగ్ మైనస్ పాయింట్స్‌. ఓవరాల్‌గా సవ్యసాచితో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు చైతూ.

విడుదల తేదీ:02/11/18
రేటింగ్: 3/5
నటీనటులు : నాగ చైతన్య, నిధి అగర్వాల్‌, మాధవన్
సంగీతం : కీరవాణి
నిర్మాత : నవీన్‌ యర్నేని
దర్శకత్వం : చందూ మొండేటి

- Advertisement -