హైకోర్టు విభజనకు గ్రీన్ సిగ్నల్..

207
hyderabad high court
- Advertisement -

ఉమ్మడి హైకోర్టు విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. హైకోర్టు విభజన ఆలస్యమవుతుండటంతో వివాదాలు తలెత్తుతున్నాయని కేంద్రానికి సూచించింది. అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణాలు పూర్తవగానే నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపున వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, ఏపీ తరపున నారీమన్ తమ వాదనలు వినిపించారు.

అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ కోర్టు నిర్మిస్తోందని వివరిస్తూ అఫిడవిట్‌ను చదివి వినిపించారు. డిసెంబరులో కోర్టు భవనాలు, మార్చి నాటికి జడ్జీలు, కోర్టు సిబ్బంది నివాస సముదాయాల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. దీంతో నిర్మాణం ప్రగతిని పరిశీలించి ఉమ్మడి హైకోర్టు విభజన కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

- Advertisement -