ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ప్రచారంలో ఇప్పటికే బీజేపీ,కాంగ్రెస్ తలమునకలవ్వగా ఛత్తీస్ గఢ్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్‌పై బరిలోకి దిగనున్నారు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మేనకోడలు కరుణ శుక్లా. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో ఆమె పేరును ఖరారు చేసింది కాంగ్రెస్.
వాజపేయి, లాల్‌కృష్ణ అద్వానీ సిద్ధాంతాలను బీజేపీ విస్మరించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న బీజేపీ అగ్రనాయకత్వం విధానాలు నచ్చకనే పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపింది.
రమణ్‌సింగ్ సిఎం హయాంలో ఛత్తీస్‌గఢ్ అన్నిరంగాల్లో వెనుకబడి పోయిందని తెలిపారు. రాజ్‌నంద్‌గావ్ నుంచి ఎంఎల్ఎ గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన కనీసం సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.