కళ్ళ మంటలు..వంటింటి చిట్కాలు

378
- Advertisement -

కళ్ళ మంటకు వాతావరణ కాలుష్యం, స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా చూడడం, కంప్యూటర్ తో చాలా సమయం గడపడం కారణం కావచ్చు. వాతావరణ కాలుష్యం దెబ్బకు ఈ మధ్య కంటి సమస్యలు ఎక్కువయ్యాయని వైద్యనిపుణులు తెలిపారు. అయితే.. కళ్ళు మంటగా ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కంటి వైద్య నిపుణలు సూచించారు. ఇక కళ్ళ మంటలకు అలర్జీ కూడా కారణమైతే.. దుమ్ము, ధూళి కారణంగా కూడా ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు తెలిపారు.

అయితే ఎక్కువ ఖర్చు లేకుండా.. ఇంట్లోనే కళ్ళకు మెరుగైన వైద్యం చేసుకోవచ్చని సూచించారు. వంటింట్లో ఉండే పదార్థాలతో ఆయుర్వేద వైద్యం ద్వారా ఉపశమనం పొందవచ్చన్నారు.

చిట్కాః1 బంగాళాదుంపలను మద్యలో కట్ చేసి… వాటికి కీర దోసకాయ ముక్కలను కలుపుకుని బాగా నూరుకుని శుభ్రమైన గుడ్డలో వేసుకుని కళ్ల మంటలు ఎక్కవగా ఉన్న ప్రదేశంలో అద్దుకోవాలి. అలా కాసేపు ఉంచుకున్న తర్వాత దూదిని పాలలో ముంచి కళ్ళను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

చిట్కాః2 కళ్ళు మంటగా ఉన్నప్పుడు ఆహార పదార్థాల్లో ఎక్కవగా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్‌తో ఎక్కవ సమయం పని చేసేవారు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇక తరచుగా రోజ్‌వాటర్‌తో కూడా కళ్ళను శుభ్రం చేసుకుంటే మంటలు తగ్గుముఖం పడతాయని కంటి వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Also Read:గేమ్ ఛేంజ‌ర్‌..అప్‌డేట్

- Advertisement -