పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ

263
- Advertisement -

తెలంగాణాలో మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి.పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు.

Saddhula Bathukamma Festival

వారికి దగ్గర్లో ఉండే ప్రధాన ప్రాంతాలు, చెరువులు, వాగుల వద్ద బతుకమ్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ అంటూ సాగే చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటుతున్నాయి. సద్దుల బతుకమ్మ సందడి కొనసాగుతోంది. తీరొక్క పూలతో సద్దుల బతుకమ్మను పేర్చిన తెలంగాణ ఆడపడుచులు.. పూల జాతరను ఘనంగా జరుపుకుంటున్నారు.

- Advertisement -