ప్రతిపక్షాల తీరును ఎండగట్టిన ఎంపి వినోద్..

262
- Advertisement -

సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎంపీ వినోద్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీకొట్టారన్న విమర్శలను ఖండిస్తూ.. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ప్రకటించలేదని.. తామెలా కాపీ కొడతామని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో నేతలందరితో చర్చించిన తర్వాతే కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించారని వినోద్ స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎండగట్టారు.

సీఎం కేసీఆర్‌కు ప్రజలను దీవెనలు ఉన్నాయని.. 2014 మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేశామని.. టీఆర్ఎస్ 100 సీట్లకు పైగా గెలవడం ఖాయమని వినోద్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని ఆయన విమర్శించారు.

సీఎం కేసీఆర్ అంటే కాంగ్రెస్ నేతలు భయపడి పోతున్నారని.. కోర్టులు కాదు.. ప్రజాకోర్టులు వెళ్దామని ఎంపీ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేదని.. కాంగ్రెస్ నేతలు ఊహల్లో బతుకుతున్నారని వినోద్ మండిపడ్డారు.

- Advertisement -