వీరరాఘవకు జక్కన్న ఫిదా..

214
rajamouli ntr
- Advertisement -

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ అరవింద సమేత’ ఈ మూవీపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. యుద్దం తర్వాత ఏం జరుగుతుంది? అనే పాయింట్‌ ని బేస్‌ చేసుకొని త్రివిక్రమ్‌ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. డేరింగ్‌ స్టెప్‌ సన్నివేశాలలో తారక్‌ పర్‌ఫార్మెన్స్‌ ఎప్పటికి గుర్తుండి పోతుంది అని అన్నారు. జగపతి బాబు విశ్వరూపాన్ని చూపించారని కొనియాడిన జక్కన్న ..చిత్ర యూనిట్‌కి విషెస్ తెలిపారు.

బాహుబలి తర్వాత రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండటంతో స్క్రిప్ట్ వర్క్‌ను వీలైనంత త్వరలో పూర్తిచేయనున్నారు జక్కన్న.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో సత్తా చాటుతోంది వీరరాఘవ. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన ఈ సినిమా ఎన్టీఆర్ గత సినిమాల రికార్డులను కూడా చెరిపేసింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా తమన్ సంగీతం అందించారు. సునీల్‌, నవీన్‌ చంద్ర, నాగబాబు ముఖ్య పాత్రలలో నటించారు.

- Advertisement -