మీటూ ఎఫెక్ట్‌…అమిర్ బాటలో అక్షయ్‌..!

303
aamir nana patekar
- Advertisement -

లైంగికదాడులకు వ్యతిరేకంగా మహిళా లోకం ‘మీ టూ’ ఆయుధంతో గర్జిస్తోంది. గతంలో తాము అనుభవించిన లైంగిక వేధింపుల పట్ల ధైర్యంగా ముందుకొచ్చి నిందితుల పేర్లు బహిర్గతం చేస్తున్నారు. బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తాతో మొదలైన ఈ ఉద్యమం.. కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్‌పై ఆమె దగ్గర పనిచేసిన మహిళా జర్నలిస్ట్‌ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా హిటెక్కింది. కార్పొరేట్‌, మీడియా, రాజకీయం,క్రీడా ఇలా అన్నిరంగాల్లో మీ టూ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్‌పై మీటూ ఎఫెక్ట్ స్పష్టంగా కనిప్తోంది.మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్‌ కపూర్‌తో కలిసి పని చేయలేనని ఇప్పటికే అమీర్ ఖాన్ తేల్చిచెప్పగా తాజాగా హీరో అక్షయ్ కుమార్‌ కూడా అమీర్‌తో జత కలిశారు. ‘హౌస్‌ఫుల్‌ 4’ షూటింగ్‌ను వెంటనే ఆపివేయాలని అక్షయ్‌ ఈ సినిమా నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలాకు చెప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హౌస్‌ఫుల్‌ 4 డైరెక్టర్‌ సాజిద్‌ ఖాన్, నటుడు నానా పటేకర్‌లపై మీటూ ఆరోపణలు రావడంతో నిర్మాత సాజిద్‌ను తప్పుకోవాలని అక్షయ్ కోరినట్లు టాక్‌.

మీటూఉద్యమానికి చెందిన వార్తలను చదివి కలత చెందానని..ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై విచారణ జరగాలని అక్షయ్ ఈ సందర్భంగా తెలిపారు. మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారితో కలిసి నటించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హౌస్‌ఫుల్‌ 4లో అక్షయ్‌కుమార్, రితేష్‌ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతీ కర్భందా, కృతీసనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -