తెలంగాణ సంస్కృతి సంప్రదాయ పండుగ బతుకమ్మ .ఈ పూల పండుగ బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని రాష్ట్ర టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న ఆకాశంలో బతుకమ్మ, నీటిలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. బతుకమ్మ సంబురాలను 50 దేశాల్లో జరుపుకుంటున్నారాని బుర్రా వెంకటేశం అన్నారు.
హైదరాబాద్‌లో బైసన్‌పోల్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్, పిపుల్స్‌ప్లాజా, ఎన్టీఆర్ స్టేడియంలో 17.18,19 తేదీల్లో జరిగే పారా మోటరింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఈ నెల 16 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫిల్మోత్సవం జరుగుతుందని తెలిపారు. టూరిజంశాఖ ఎండీ మనోహర్ మాట్లాడుతూ ఈ నెల 17న వినూత్నంగా సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై లేజర్‌షో ఏర్పాట్లు చేశారు.
న్యూజిలాండ్‌లో జరిగే మహా బతుకమ్మ ఉత్సవాలకు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డర్న్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఒక ప్రకటనలో తెలిపారు.