ప్రస్తుతం దేశంలో #MeToo ఉద్యమం నడుస్తోంది. మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ నటి తను శ్రీ దత్తా నటుడు నానా పటేకర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తర్వాత కొంతమంది తన్మయికి మరికొంతమంది నానా పటేకర్కు మద్దతుగా నిలవడంతో మీటూ ఉద్యమం ఉధృతం అయింది. అగ్రహీరోయిన్స్తో పాటు జర్నలిస్టు,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తమకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ మద్దతు తెలిపారు.
తాజాగా దక్షిణాది సింగర్ చిన్మయి తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ట్వీట్ చేశారు. తమిళ రచయిన వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో చిన్మయిపై తమిళ సినీ ప్రముఖులు భగ్గమన్నారు. ఈ నేపథ్యంలో చిన్మయికి మద్దతుగా నిలిచింది అక్కినేని సమంత.
కొందరు వ్యక్తులు, అందులోనూ కొందరు మహిళలు సైతం…. #మీటూ ఉద్యమంలో భాగమైన వారికి వ్యతిరేకంగా మాట్లాడటం, మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నింస్తుండటం బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎదుక్కొంటున్న వారికి సారీ అని సమంత ట్వీట్ చేసింది.
సమంత నటించిన ఎక్కువ శాతం సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది.తనకు పదేళ్లుగా చిన్మయి తెలుసు ఆమెకు నేను మద్దతుగా నిలుస్తాను #istandwithchinmayi అంటూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంతతో పాటు మరికొందరు కూడా చిన్మయికి తమ మద్దతు తెలుపుతున్నారు.
Dear @23_rahulr and @Chinmayi I know the both of you for ten years now . I don’t know two more brutally honest people .It is this attribute of yours that I value most in our friendship . I love you with all my heart and what you say is the TRUTH !! #istandwithchinmayi
— Samantha (@Samanthaprabhu2) October 10, 2018