ఎనర్జిటిక్ హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, రొమాంటిక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకువచ్చింది చిత్ర యూనిట్.
తన లవ్ సక్సెస్ అయ్యేందుకు రామ్ ఎన్ని ఎత్తుగడలు వేస్తాడనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ని చూస్తే తెలుస్తుంది.స్కూల్ అయినా కాలేజీ అయినా అమ్మాయిల్లో ఎవరు బాగున్నారని అబ్బాయిలు,అబ్బాయిల్లో ఎవరు బాగున్నారని అమ్మాయిలు ఏరుకోవడం, అబద్దాలు చెబితేనే అమ్మాయిలు పడతారు,కూతురుకి ఏదైనా చేశామని బాధలో మందేసేవాడిని ఫాదర్ అంటారు,లవర్ రిజెక్ట్ చేసిందని బాధలో మందేసేవాడిని లవర్ అంటూ రామ్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.
ప్రకాశ్‌రాజ్, సురేష్, పోసాని కృష్ణ మురళి కీలకపాత్రలో నటిస్తుండగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలు సోమవారం మార్కెట్లోకి డైరెక్ట్‌గా విడుదలయ్యాయి. అక్టోబర్ 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. అక్టోబర్ 18న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.