కాంగ్రెస్,టీడీపీ మహాకూటమి జతకట్టడం అవకాశ వాద రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును నిలదీశారు. గతంలో కాంగ్రెస్‌పై చంద్రబాబు చేసిన ట్వీట్‌ను పోస్ట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.
So the “Italian Mafia Raj” (as described below) has new friends now. Guess who it is ?
Now you know why I call it #MahaGhatiyaBandhan pic.twitter.com/RQQCOueTd7
— KTR (@KTRTRS) October 9, 2018
అవినీతి కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి కలిగించడమే తమ లక్ష్యమని ప్రకటించిన చంద్రబాబు ఇవాళ అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. నాడు కాంగ్రెస్‌ను ఇటాలియన్ మాఫియా రాజ్‌తో పోల్చిన చంద్రబాబు ఇప్పుడదే ఇటాలియన్ మాఫియా రాజ్‌తో ఎలా జతకట్టారో ప్రజలకు చెప్పాలన్నారు.
Another pearl of wisdom from CBN Garu👇
If Scamgress leaders Rahul & Sonia didn’t do squat for Telangana development till 2014, what changed since then? #MahaGhatiyaBandhan pic.twitter.com/jfX0anT1mi
— KTR (@KTRTRS) October 9, 2018
విపక్షాలది అది మహాకూటమి కాదని మహాఘటయాబంధన్ అని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించడం వల్లే 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పుడు టీడీపీ-కాంగ్రెస్ పొత్తుకు ప్రాతిపదిక ఏంటని ప్రశ్నించిన కేటీఆర్ అవకాశవాదం అధికార దాహంతోనే టీడీపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయని మండిపడ్డారు.
“Our aim is to make nation free of corrupt congress”.
Famous last words 😅👇#MahaGhatiyaBandhan pic.twitter.com/N6UQfSTePw
— KTR (@KTRTRS) October 9, 2018