భారత పర్యటనలో భాగంగా ఈ నెల 12న కోహ్లీ సేనతో రెండో టెస్టులో తలపడనుంది వెస్టిండీస్. టెస్టు మ్యాచ్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.
1200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రతిరోజు 4వేల మంది స్కూల్ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించారు. 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, హెల్మెట్లు, మంచినీళ్ల బాటిల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులను అనుమతించేది లేదన్నారు.
అక్టోబర్ 12 నుంచి 16 వరకు మ్యాచ్ జరగనుంది. భారత పర్యటనలో భాగంగా వెస్టిండీస్ 2 టెస్టులు, 5 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల్లో తలపడనుంది. తొలిటెస్టులో వెస్టిండీస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.