నిరుద్యోగ భారతం…10వేలతో నెట్టుకొస్తున్నారు!

307
un employed
- Advertisement -

నిరుద్యోగం … యువతరాన్ని వెంటాడుతున్న సమస్య! చదువుకు తగ్గ ఉద్యోగం సంగతి అలా ఉంచితే, ఏదో ఒక ఉపాధి దొరికితే చాలని కాళ్లరిగేలా తిరుగుతున్న యువకులు ఎందరో..! ఇంజినీరింగ్‌లు, పిజీలు చేసిన వారు కూడా కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం, వాచ్‌మెన్ల పోస్టుల కోసం బారులు తీరారన్న వార్తలు తరచు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ముందు నేతలు ఇచ్చే హామీలు ఎలా ఉన్నప్పటికీ, అధికారంలోకి వచ్చాక శూన్య హస్తాలే చూపుతుండటంతో నిరుద్యోగ సైన్యం ఏటికేడాది పెరుగుతోంది

గత 20 సంవత్సరాల్లో భారత్‌లో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సెంటర్‌ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయిమెంట్ 2018 నివేదిక తేల్చింది. 16 శాతం మంది చదువుకున్న యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. గత 20 ఏళ్లతో పోలిస్తే నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిన సందర్భం ఇదే అని తెలిపింది.

సాధారణ జీవన ప్రమాణానికి సరిపడే వేతనాలు లేవని చెప్పింది. అతి తక్కువ జీతాలతో బతుకును నెట్టుకొస్తున్నారని తెలిపింది. స్త్రీలలో 92 శాతం మంది, పురుషుల్లో 82 శాతం మంది నెలకు 10 వేల లోపే సంపాదిస్తున్నారని చెప్పింది. జాతీయ పే కమిషన్‌ నిర్ణయించిన కనీస వేతనం 18 వేల కన్నా ఇది తక్కువేనని చెప్పింది. కమిషన్‌ నిర్ణయించిన కనీస వేతనం 18 వేల కన్నా కూడా ఇది అతి తక్కువ.

భారతదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునర్జీవనం కల్పిస్తే తప్ప పరిస్థితులు చక్కబడవని, ఆ మేరకు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు దృష్టిసారించాలని సామాజిక అధ్యయన సంస్థ సూచించింది. 21వ శతాబ్దపు ఇండియాకు స్మార్ట్ సిటీలకన్నా స్మార్ట్ విలేజ్ ల అవసరం ఉందని అభిప్రాయపడింది.

- Advertisement -