సవ్య సాచి…వై నాట్

246
savyasachi
- Advertisement -

ప్రేమమ్ లాంటి సెన్సిబుల్ లవ్ ఎంటర్ టైనర్ అనంతరం నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సవ్యసాచి” చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేయనున్నారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తుండడం విశేషం. ఒక పాట మినహా “సవ్యసాచి” షూటింగ్ పూర్తయ్యింది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ నెల 9న ఉదయం 11 గంటలకు వై నాట్ అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ప్రేమమ్చిత్రం తరువాత చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఈ టీజర్‌లో చైతూ నటన చూసిన ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు సంతోషంతో మురిసిపోతున్నారు.

savya sachi

- Advertisement -