వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత,మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది మదర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు విజయలక్ష్మి. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి..పరిచయాన్ని ఆసరాగా చేసుకుని శారీరకంగా లొంగదీసుకున్నాడని తెలిపింది.
ఎనమిదేళ్ల క్రితం భూపాలపల్లిలో మదర్ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించానని… ఈ క్రమంలో గండ్ర వెంకటరమణారెడ్డితో పరిచయం ఏర్పడిందని తెలిపింది విజయలక్ష్మీ. 2014లో అనారోగ్యంతో ఆయన ఇంటికి వెళ్తే బలవంతంగా లోబర్చుకున్నారని చెప్పారు. నాలుగేండ్లుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నానని, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచేందుకే బయటకువచ్చానని కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ విషయాన్ని బయటకుచెబితే అంతుచూస్తానంటూ రివాల్వార్తో బెదిరించారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడినుంచి బయటపడ్డాడని చెప్పారు. గండ్ర సోదరుడికి విషయం చెప్పితే ఆయన కూడా బెదిరించారని అన్నారు.తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలేదని, అతని ఆస్తులు, అంతస్తులు అవసరం లేదని చెప్పారు.