బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా మరో సినిమాకి కమిట్ అయ్యాడు ప్రభాస్.
జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ స్టోరిలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. తాజాగా హీరో ప్రభాస్ కూడా ఇటలీలో యూనిట్‌తో జాయిన్ అయ్యారు.
గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా ఇటలీ స్ధానిక అధికారులతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చాడు. మీసాలు లేకుండా సరికొత్త లుక్‌లో డార్లింగ్ అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.