విండీస్‌తో సమరానికి కోహ్లీ సేన రెడీ

207
india vs westindies
- Advertisement -

భారత్-వెస్టిండీస్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోహ్లీ లేకున్నా ఆసియాకప్‌ను గెలుచుకున్న భారత్‌..విండీస్‌కు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. జేసన్ హోల్డర్ నేతృత్వంలోని కరేబియన్‌ జట్టు బౌలింగ్‌ను భారత జట్టు ఏ విధంగా ఎదుర్కొంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.

నలభై రోజుల పర్యటనలో కరీబియన్ టీమ్ రెండు టెస్ట్‌లు,ఐదు వన్డేలు, మూడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడనుంది.అక్టోబర్ 4న రాజ్‌కోట్ టెస్ట్‌తో ఆరంభం కానున్న వెస్టిండీస్ పర్యటన నవంబర్ 11న చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా మూడో టీ20తో ముగుస్తుంది.

రాబోయే వరల్డ్ కప్ ముందు జరుగుతున్న టోర్నమెంట్ కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉన్న అనుభవం ఉండటంతో భారత్‌కు గట్టిపోటీ నిచ్చేందుకు సిద్ధమవుతున్నారు వెస్టిండీస్ ప్లేయర్లు.

ఫామ్‌లేమి కారణంగా సీనియర్ ఓపెనర్లు ధవన్, మురళీ విజయ్‌కు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్ దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్న యువ క్రికెటర్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించింది. దీనికి తోడు విరామం లేకుండా సిరీస్‌లు ఆడుతున్న భువనేశ్వర్, బుమ్రాకు విశ్రాంతినిస్తూ హైదరాబాదీ మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్‌కు అవకాశమిచ్చింది. యువ క్రికెటర్లు తమకు దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే భారత్ గెలుపు నల్లేరుపై నడకే కావచ్చు.

- Advertisement -