బాపుఘాట్‌లో నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌..

199
- Advertisement -

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు మల్లారెడ్డి, బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు.

CM KCR

ESL Narasimhan

- Advertisement -