పాక్‌కి షాకిచ్చిన బంగ్లాదేశ్..

250
Pakistan vs Bangladesh
- Advertisement -

ఆసియాకప్‌లో పాక్‌ వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఫైనల్‌కి చేరాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. సూపర్‌ 4 చివరి మ్యాచ్‌లో అన్నిరంగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బంగ్లా…పాక్‌ని మట్టికరిపించింది. 37 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఫైనల్‌కి చేరి భారత్‌తో తుది సమరానికి సిద్ధమైంది.

బంగ్లా విధించిన 240 పరుగుల లక్ష్య చేదనలో తడబడింది పాక్‌. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 202 పరుగులు మాత్రమే చేసింది. ఇమాముల్ హక్ 85 (105 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), షోయబ్ మాలిక్ 30 (51 బంతుల్లో 2 ఫోర్లు) పాక్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ వీరిద్దరు ఔటైన తర్వాత పాక్ కొలుకోలేకపోయింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4 వికెట్లు పడగొట్టాడు.

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిం పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో ముష్ఫికర్ రహీమ్‌, మిథున్ జోడి 144 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మిథున్ 60,ముష్ఫికర్ 99 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ 4 వికెట్లు తీయగా.. షాహిన్ అఫ్రిది, హసన్ అలీ తలా రెండు వికెట్లు తీశారు. ముష్ఫికర్ రహీమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

- Advertisement -