గులాబీ జెండాతోనే కొడంగల్ అభివృద్ధి:హరీష్‌

224
harish rao
- Advertisement -

కొడంగల్ అభివృద్ధి చెందాలంటే గులాబీ జెండా రెపరెపలాడలన్నారు మంత్రి హరీష్‌. తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన గొల్లకురుమ సంఘం ప్రతినిధులు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన హరీష్ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 10 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ది లేదని చెప్పారు.పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కేసులు వేశారని చెప్పారు. ప్రతి ఇంటికీ తాగునీరు,సాగునీరు రావాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.

రైతుల సంక్షేమం కాంగ్రెస్ నేతలకు పట్టదని…వాళ్లు చేయరు..చేసేవాళ్లకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుపై కోర్టులో కేసులు వేసినప్పుడు నిజంగానే అక్కడ పెద్ద పులులు ఉన్నాయా? అడవులు దెబ్బతింటాయా? అని మంత్రి జూపల్లిని అడిగితే.. అక్కడ పులులు కాదు కదా.. గండుపిల్లులు కూడా లేవన్నారు. అడవులు కాదు ఆముదపు చెట్టు కూడా లేవని తనతో అన్నట్టు చెప్పారు.

- Advertisement -