ఓటుతో మహాకూటమికి షాకివ్వండి:హరీష్

232
harish rao gajwel
- Advertisement -

ఒక్క ఓటుతో మహాకూటమికి షాకివ్వాలని ప్రజలను కోరారు మంత్రి హరీష్‌. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ములేక కూటమి కట్టారని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు,మార్కుక్ మండలాల్లో పర్యటించిన హరీష్‌ కాంగ్రెస్ నాయకుల వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసి చూపిందని వెల్లడించారు.

నియోజకవర్గ ఓటర్లు అభివృద్ధి వైపా, అవకాశవాదానికా తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వస్తే కాలిపోయే మోటార్లు,ఎరువుల కొరత,కరెంట్ కోత తప్ప ఇంకేమీ ఉండదన్నారు. కళ్ల ముందు,కంటి ముందు అభివృద్ధి కనిపిస్తుంటే కేసీఆర్‌కు తప్ప ఎవరికి ఓటేస్తారన్నారు. రైతు బీమా,రైతు బంధుతో వారి జీవితాలకు భరోసా కల్పించామన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటేస్తామని గుంటిపల్లె ప్రజలంతా తీర్మానం చేశారనీ.. అదే స్ఫూర్తితో యావత్‌ తెలంగాణ ప్రజానీకం టీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలవాలని కోరారు. కొండపోచమ్మ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోదండరామ్‌ తీవ్రంగా యత్నించాడని..ఆయన గురించి మాట్లాడుకంటే టైం వేస్ట్ అన్నారు .అభివృద్ధిలో గజ్వెల్ నంబర్ వన్, మెజారిటీతో కూడా గజ్వెల్ నంబర్ వన్ గా
ఉండాలన్నారు.రాబోయే రోజుల్లో వర్షం పడినా, పడక పోయినా కాళేశ్వరం నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం హామి ఇచ్చారు.

- Advertisement -