పాక్‌పై భారత్‌ ఘన విజయం..

222
- Advertisement -

ఆసియాక్‌పలో భారత జైత్ర యాత్ర కొనసాగుతోంది. రోహిత్‌ శర్మ (119 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 111 నాటౌట్‌), శిఖర్‌ ధవన్‌ (100 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 114) సూపర్‌ సెంచరీలతో ఫామ్‌ చాటుకోవడంతో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్‌-4లో భారత్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్లో ప్రవేశించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 237 పరుగులు చేసింది.

షోయబ్‌ మాలిక్‌ (78) అర్ధ సెంచరీ చేయగా కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (44) రాణించాడు. ఆఖర్లో ఆసిఫ్‌ అలీ (30) వేగంగా ఆడాడు. బుమ్రా, చాహల్‌, కుల్దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారత్‌ 39.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 238 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు ధవన్‌కు దక్కింది.

India beat Pakistan, storm into final

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: ఇమాముల్‌ ఎల్బీ (బి) చాహల్‌ 10; జమాన్‌ ఎల్బీ (బి) కుల్దీప్‌ 31; అజామ్‌ రనౌట్‌ 9; సర్ఫ్‌రాజ్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 44; మాలిక్‌ (సి) ధోని (బి) బుమ్రా 78; అసిఫ్‌ అలీ (బి) చాహల్‌ 30; షాదాబ్‌ (బి) బుమ్రా 10; నవాజ్‌ నాటౌట్‌ 15; హసన్‌ అలీ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 237.

వికెట్ల పతనం: 1-24, 2-55, 3-58, 4-165, 5-203, 6-211, 7-234;

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 9-0-46-0; బుమ్రా 10-1-29-2; చాహల్‌ 9-0-46-2; కుల్దీప్‌ 10-0-41-2; జడేజా 9-0-50-0; జాదవ్‌ 3-0-20-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ నాటౌట్‌ 111; ధావన్‌ రనౌట్‌ 114; రాయుడు నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (39.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 238;

వికెట్ల పతనం: 1-210

బౌలింగ్‌: ఆమిర్‌ 5-0-41-0; షహీన్‌ అఫ్రిది 6-0-42-0; హసన్‌ అలీ 9-0-52-0; నవాజ్‌ 7-0-35-0; షాదాబ్‌ 8-0-54-0; షోయబ్‌ మాలిక్‌ 4.3-0-14-0.

- Advertisement -